మోదీ కార్యక్రమంలో ఆకట్టుకున్న శ్రీవల్లి పాట
అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గౌరవార్థం న్యూయార్క్ లోని నాసౌ వెటరన్స్ కొలోజియం స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎన్నారైలు పాల్గొని ఆయనకు జేజేలు పలికారు. ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్ఏ ఆధ్వర్యంలో ‘మోదీ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పుష్ప-1లోని శ్రీవల్లి పాటతో ఊర్రూతలూగించారు. డీఎస్పీ నోట ‘హర్ ఘర్ తిరంగా పాట’ సాగుతుండగానే మోదీ వేదికపైకి చేరుకున్నారు. ఈ క్రమంలోనే కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ‘నమస్తే ఇండియా’ అంటూ ప్రవాస భారతీయులను పలకరించిన దేవిశ్రీ.. మోదీ సమక్షంలోనే తన పాటను కొనసాగించారు. అనంతరం డీఎస్పీతో పాటు గుజరాతీ గాయకుడు ఆదిత్య గాఢ్వీ, ఇతర కళాకారులను మోదీ అభినందించారు.







