అమెరికాలోని చర్చిలో కలకలం
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ చర్చిలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. హ్యూస్టన్‌లో ఉన్న లేక్వుడ్ చర్చిలో ఈ ఘటన చోలు చేసుకుంది. పొడవైన రైఫిల్‌తో వచ్చిన నిందితురాలు చర్చిలో ఉన్న వారిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో అయిదేళ్ల బాలుడు, మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలు కాగా, ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. పోలీసుల కాల్పుల్లో నిందితురాలు మరణించింది. ఆమె కాల్పులకు పాల్పడటమే కాకుండా ఏదో రసాయానాన్ని నేలపై జల్లినట్టు ప్రత్యక్ష సాకులు వెల్లడించారు. సుమారు 20 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరిగినట్లు వారు తెలిపారు. గాయపడిన బాలుణ్ని నిందితురాలే చర్చికి తీసుకొచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తన దగ్గర బాంబు ఉందని ఘటన సమయంలో ఆమె బెదిరింపులకు దిగినప్పటికీ పోలీసులు అలాంటిదేమీ లేదని తేల్చారు. నిందితురాలు ఎవరనేది ఇంకా వెల్లడిరచలేదు. ఘటనపై సమాచారాన్ని సేకరిస్తున్నామని శ్వేతసౌధం ఒక ప్రకటనలో పేర్కొంది.







