TTA: టీటీఏ ఆధ్వర్యంలో ఎస్ఏటీ/ఏసీటీ ప్రిపరేషన్ వెబినార్ విజయవంతం!
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) యూత్ కమిటీ చైర్ ప్రణవి మల్లిపెద్ది చొరవతో ఎస్ఏటీ/ఏసీటీ (SAT/ACT ప్రిపరేషన్ వెబినార్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆమె కృషిని టీటీఏ (TTA) అభినందించింది. విద్యార్థులకు విలువైన సలహాలివ్వడంతోపాటు మార్గదర్శకత్వం చేసిన ప్రముఖ వక్తలు సత్య వర్దిరెడ్డి, డాక్టర్ పి.వి. రెడ్డికి టీటీఏ (TTA) ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ సెషన్ కళాశాల ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎన్నో కీలకమైన విషయాలను తెలుసుకోవడంలో ఈ వెబినార్ ఉపయోగపడిందని విద్యార్థులు చెప్పారు.







