TAGC: చికాగోలో ఘనంగా సంక్రాంతి సంబరాలు, రంగోలి పోటీలు
చికాగో: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో (TAGC) ఆధ్వర్యంలో సంక్రాంతి, భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా “సంక్రాంతి ముగ్గుల పోటీలు” (Rangoli Competition) ఏర్పాటు చేశారు.
పోటీ వివరాలు, నిబంధనలు…
ఈ రంగోలి పోటీలో పాల్గొనాలనుకునే వారు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది
ముఖ్య గమనిక: రంగోలి పోటీకి నమోదు చేసుకునే ముందు ప్రధాన ఈవెంట్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి.
మెటీరియల్: పాల్గొనే ప్రతి కుటుంబానికి 12 X 12 అంగుళాల మ్యాట్ బోర్డును TAGC వారు అందిస్తారు. తెలుపు, గోధుమ రంగులను కూడా అసోసియేషన్ వారే సరఫరా చేస్తారు. ఇతర రంగులు, అలంకరణ సామగ్రిని పోటీదారులు స్వయంగా తెచ్చుకోవచ్చు.
విధానం: ముగ్గులు కేవలం చుక్కల ఆధారంగానే వేయాలి. ఎటువంటి స్టిక్కర్లు, స్టెన్సిల్స్ లేదా చీట్ షీట్లను అనుమతించరు.
సమయం: పూర్తి చేసిన రంగోలిని ప్రధాన ఈవెంట్ రోజున మధ్యాహ్నం 3:00 గంటల లోపు ఫ్రంట్ డెస్క్ వద్ద సమర్పించాలి.
విజేతల ఎంపిక:
ముగ్గు రూపం, థీమ్, డిజైన్, సృజనాత్మకత, రంగుల కలయిక ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు. మొదటి, రెండో బహుమతి పొందిన విజేతలను ప్రధాన వేడుకలో ప్రకటిస్తారు. జడ్జిల నిర్ణయమే ఫైనల్.
రిజిస్ట్రేషన్ వివరాలు:
ఆసక్తి గల వారు 2026, జనవరి 9వ తేదీ లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం www.tagc.org/upcoming-events వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా పోస్టర్‌పై ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేయవచ్చు.
మరింత సమాచారం కోసం…
నీలిమ చేయ్కిచర్ల: 775-275-0619
శిరీష పులుగుర్త: 224-440-6105
స్వాతి బండి: 203-970-0952
శృతిక మట్ట: 847-637-6315
అర్చన పొద్దుటూరి (ప్రెసిడెంట్): 630-849-9135
ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీరు cultural@tagc.org కు ఈమెయిల్ చేయవచ్చు.






