ట్రంప్ కిమ్ నాణేనికి పెరిగిన డిమాండ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మధ్య భేటీ జరుగుతుందో లేదో సృష్టత లేదు. అయితే, సింగపూర్‌లో జూన్ 12న జరగాల్సిన వీరి భేటీ నేపథ్యంలో విడుదలైన స్మారక నాణేనికి మాత్రం ట్రంప్ ప్రకటన తర్వాత మరింత డిమాండ్ పెరిగింది. ఎంతలా అంటే దీన్ని విక్రయిస్తున్న వైట్ హౌస్ గిప్ట్ షాప్ వెబ్సైట్ క్రాష్ అయ్యేంతగా. వాస్తవానికి ఇలాంటి నాణేలు రెండు ఉన్నాయి. అందులో ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది. వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ ఏజెన్సీ (డబ్యూహెచ్సీఏ) తయారు చేసిన ట్రంప్, కిమ్ నాణెం. ఈ ఏజెన్సీ తయారు చేసే నాణేలను విదేశీ అతిథులు, రాయబారులకు బహుకరిస్తూంటారు. మరొకటి, ట్రంప్, కిమ్‌ల తో పాటు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ ముగ్గురి ఛాయా చిత్రాలతో కూడిన నాణెం. దీన్నే వైట్ హౌస్ గిప్ట్ షాపు విక్రయిస్తోంది. దీని వాస్తర ధర 24.95 డాలర్లు (రూ.1,693) కాగా, భారీ రాయితీ కల్పించి 19.95 డాలర్లకే (రూ.1,354) దీన్ని అమ్మకానికి పెట్టింది ఒక వేళ ఈ ఇద్దరు నాయకుల మధ్య భేటీ జరగకపోతే డబ్బుల్ని వెనుక్క ఇస్తామని కూడా చెబుతోంది.













