ఆధిపత్యం ప్రదర్శించే కోరిక లేదు
రెండో హిందూ కాంగ్రెస్ సభలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
చికాగో – ఉత్తమ సమాజ నిర్మాణం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఏకం కావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. చికాగోలో నిర్వహించిన రెండో ప్రపంచ హిందూ కాంగ్రెస్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడంలో అహంకారాన్ని నియంత్రించడం, వ్యక్తుల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం వంటి అంశాలే కీలకమని అభిప్రాయపడ్డారు. ”మనలో తెలివి, జ్ఞానం ఉన్నా ఐకమత్యం మాత్రం లేదు. సింహం ఒంటరిగా ఉంటే వేటకుక్కలు కూడా దానిపై దాడిచేసి నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయనే విషయం గుర్తుంచుకోవాలి. హిందూ సమాజంలో ఎంతోమంది ప్రముఖులున్నా వారెన్నడూ ఒకే గొడుగు కిందకు రాలేదు. హిందువుల్లో ఐకమత్యం లేకపోవడమే అతిపెద్ద సమస్య. మనకు ఆధిపత్యం ప్రదర్శించాలనే కోరిక లేదు. మూలాలను, ఆధ్యాత్మికతను మర్చిపోవడం వల్లే మనం వెనుకబడి ఉన్నాం.’ అని భగవత్ పేర్కొన్నారు. అడ్డంకులు స ష్టించేవారు ఉంటారని, కానీ, మనది పురుగుకు కూడా హాని చేసే సంస్క తి కాదన్నారు. ఐకమత్యంతో ఉన్నప్పుడే అభివృద్ధి సాధించగలమన్నారు.
భారత సంతతికి చెందిన అమెరికన్ కాంగ్రెస్ నాయకుడు రాజా కృష్ణమూర్తి మాట్లాడుతూ, హిందూ మత లక్షణాలైన సహనం, ప్రేమ, వైవిధ్యం వంటి లక్షణాలను భావితరాలకు కూడా అందించాలని భారత సంతతికి చెందిన అమెరికన్ కాంగ్రెస్ నాయకుడు రాజా కృష్ణమూర్తి కోరారు. 1893లో చికాగోలో స్వామి వివేకానంద చరిత్రాత్మక ప్రసంగం చేసి 125 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా అమెరికా సహా పలు దేశాల్లో మతపరమైన వివక్ష కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానందకు ఆధ్యాత్మిక వారసుడిగా దీన్ని ఎదుర్కొని నిలబడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
ఈ సమావేశానికి వచ్చిన అతిథులకు నిర్వాహకులు ఒక స్వీట్ బాక్స్ అందజేశారు. అందులో రెండు లడ్లు ఉన్నాయి. ఒక లడ్డు చాలా మెత్తగా ఉండగా మరో లడ్డు చాలా గట్టిగా ఉంది. ఈ రెండు లడ్లకు ఒక చిన్న కథ కూడా చెప్పారు. ఈ రెండు లడ్లులా హిందూ సమాజం ఒక్కటిగా లేదని నిర్వాహకులు తెలిపారు. నేటి హిందూ సమాజం చాలా సుతిమెత్తగా ఉందని దాన్ని చీల్చడం చాలా సులభమని అదే మెత్తని లడ్డు సూచిస్తుందని చెప్పిన నిర్వాహుకులు… భవిష్యత్తులో హిందూ సమాజం గట్టి లడ్డూల ఉండాలని హిందూ కార్యనిర్వాహకులు కోఆర్డినేటర్ గణేషన్ గున మగేసన్ తెలిపారు. హిందువులంతా కలిసిగట్టుగా ఉంటేనే తమ హక్కులను సాధిచుకోగలుగుతామని స్వామి పూర్ణాత్మానంద అన్నారు. హిందూ మతబోధనలు మానవత్వం కోసమే అన్న స్వామీజీ… ప్రతి స్కూలు, కాలేజీలో హిందూ మతబోధనలు చేయాలని ఆయన కోరారు.
భారత్‌లోని విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని చిన్మయ మిషన్ ఆత్మీయగురువు అన్నారు.పాఠ్య పుస్తకాలలో హిందూ మతంకు సంబంధించిన సంస్క తిని చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాచీన కాలంలో గురుకులాల్లో రుషులు శిష్యులకు ఎలాగైతే బోధించారో అలానే బోధించాలని తెలిపారు. భగవంతుడు విశ్వాన్ని మనిషి కోసం సష్టించలేదని… ప్రకతిని హిందువులు కాపాడాలనే బాధ్యతను అప్పగించారని ఆయన చెప్పారు. ఈ సమావేశాలకు బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్ సహా 2,500మంది ప్రతినిధులు హాజరయ్యారు.













