విద్యార్థులకు రవి పొట్లూరి సహాయం…
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మీ ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలలో చదువుతున్న నాలుగు వందల మంది విద్యార్థులకు ఆగస్టు 10వ తేదీన కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ అధ్యక్షుడు రవి పొట్లూరి సహకారంతో యాభై వేల రూపాయల విలువైన ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్స్ అందించారు. లాభాపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడానికి కృషి చేస్తున్న బాలభారతి పాఠశాలకు ప్రతి సంవత్సరంలాగానే 2022లో కూడా సహాయం అందిస్తామని కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి తెలిపారు.













