కృష్ణా జిల్లాలో డిజిటల్ తరగతి గదిని ప్రారంభించిన రవి పొట్లూరి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కోశాధికారి రవి పొట్లూరి కృష్ణాజిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండి హైస్కూల్లో డిజిటల్ తరగతి గదిని లాంఛనంగా ప్రారంభించారు. న్యూజెర్సీలోని ‘దక్కన్ స్పైస్’ హోటల్ యజమాని బొబ్బా గోవర్ధన్ డిజిటల్ క్లాసు రూం ఏర్పాటుకు అవసరమైన నిధులను విరాళంగా ఇచ్చారు. ఆ నిధులతో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదిని తానా కోశాధికారి పొట్లూరి రవి ఈ కార్యక్రమంలో దాత బొబ్బా గోవర్ధన్‌తో పాటు ముప్పా రాజశేఖర్, ఎదురుమొండి గ్రామప్రముఖులు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.













