GTA: గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వాషింగ్టన్ డీసీ చాప్టర్‌కు అరుదైన గౌరవం

గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) వాషింగ్టన్ డీసీ చాప్టర్‌కు అరుదైన గౌరవం దక్కింది. జీటీఏ (GTA) విశేష సేవలను, సాంస్కృతిక సహకారాన్ని అభినందిస్తూ లాడౌన్ కౌంటీ బోర్డ్ ఆఫ్ సూపర్‌వైజర్స్ అక్టోబర్ 21న అధికారిక ప్రకటన (Proclamation) విడుదల చేశారు. ఈ సందర్భంగా లాడౌన్ కౌంటీ బోర్డ్ ఆఫ్ సూపర్‌వైజర్స్ ఛైర్ ఫిల్లీస్ జె. రాండాల్, ఇతర బోర్డు సభ్యులు.. జీటీఏ (GTA) కృషి, సేవలను అభినందించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంత సంప్రదాయాలను చాటి చెప్పే బతుకమ్మ, దసరా వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిం
అమెరికాతోపాటు తెలంగాణలో కూడా గొప్ప సామాజిక సేవ చేస్తున్న జీటీఏ (GTA) నాయకత్వం, అంకితభావం కలిగిన వాలంటీర్లను ఈ ప్రకటనలో ప్రశంసించారు. ఈ గౌరవం దక్కడంపై జీటీఏ (GTA) హర్షం వ్యక్తంచేసింది. తమకు ఈ గుర్తింపు దక్కడానికి చొరవ చూపిన లాడౌన్ కౌంటీకి, ముఖ్యంగా తమకు ఎంతో మద్దతిచ్చిన సూపర్‌వైజర్ లారా ఎ. టెక్రోనీకి జీటీఏ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.