ప్రింట్ మీడియాకు రూ.15 వేల కోట్ల నష్టం!
కరోనా వైరస్ మహమ్మారి దేశీయ ప్రింట్ మీడియా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. లాక్డౌన్ విధించినప్పటి నుంచి రెండు నెలల కాలంలో ఈ పరిశ్రమకు రూ.4500 కోట్ల మేరకు నష్టం వచ్చింది. న్యూస్పేపర్ పరిశ్రమను ఆదుకునేందుకు ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) ప్రకారం, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పటి నుంచి ఎలాంటి ప్రకటనలు లేవు. నష్టాలు వచ్చే ఆరు, ఏడు నెలల వరకు ఇలాగే కొనసాగవచ్చు. దీని వల్ల పరిశ్రమకు ఈ నష్టం రూ.12,000 కోట్ల నుంచి 15,000 కోట్లకు పెరగవచ్చు. ప్రభుత్వం తక్షణమే ఉద్దీపన ప్యాకేజీతో ఆదుకోవాలని ఐఎన్ఎస్ కోరింది.













