త్వరలో ట్రంప్ -కిమ్ భేటీ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ త్వరలో మరోసారి భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్‌తో రెండో సారి సమావేశమయ్యేందుకు కిమ్ అంగీకరించారని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లో కిమ్‌తో పాంపియో భేటీ అయ్యారు. కొరియా ద్వీపకల్పాన్ని అణ్వాయుధరహితంగా మార్చడంపై చర్చలు జరిపారు. ట్రంప్‌తో వీలైనంత త్వరలో మళ్లీ సమావేశమయ్యేందుకు కిమ్ అంగీకరించారని పాంపియో వెల్లడించారు. ఈ ఏడాది జూన్‌లో ట్రంప్, కిమ్ తొలిసారిగా సింగపూర్‌లో సమావేశమైన సంగతి తెలిసిందే.













