16 నుంచి వీసా అపాయింట్మెంట్లు రద్దు
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశంలో ఆరోగ్య అత్యయిక పరిస్థితి (హెల్త్ ఎమర్జెన్సీ)ని ప్రకటించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు 5 వేల కోట్ల డాలర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఫెడరల్ ప్రభుత్వానికి ఉన్న సర్వాధికారాలను వినియోగించుకుంటూ నేను జాతీయ అత్యయిక పరిస్థితిని ప్రకటిస్తున్నాను అని ట్రంప్ శ్వేతసౌధంలో ప్రకటించారు. మరోవైపు మార్చి 16 తదుపరి ప్రకటన వచ్చే వరకు ఇమిగ్రెంట్, నాన్ ఇమిగ్రెంట్ వీసా అపాయింట్మెంట్లు అన్నింటిని రద్దు చేస్తున్నట్లు యూఎస్ మిషన్ ఇండియా ప్రకటించింది.













