అమెరికా నర్సుకు రూ.4846 కోట్ల లాటరీ
అమెరికాలోని మసాచ్యుసెట్స్‌లో ఓ హాస్పిటల్లో పనిచేస్తున్న మావిస వాన్జిక్(53)కు లాటరీ తగిలింది. రూ.4846 కోట్ల పైచిలుకు గెలుచుకుని ఆమెరికా చరిత్రలోనే ఒకే టిక్కెట్‌పై అత్యధిక మొత్తాన్ని గెలుచుకున్న వ్యక్తిగా నిలిచారు. బుధవారం డ్రాతీయగా, ఆమెకు జాక్‌పాట్ తగిలినట్లు గురువారం ప్రకటించారు. లాటరీ గెలుచుకున్న ఆ నర్సు ఇకపై తాను ఉద్యోగం చేయబోనని ప్రకటింపజేసింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మావిస్ ఇటీవలే భర్తను కోల్పోయారు. తొమ్మిది నెలల క్రితం బస్సు కోసం ఎదురు చూస్తున్న విలియంను ఓ వాహనం ఢీకొట్టడంతో ఆయన చనిపోయారు. ఇద్దరు పిల్లల పోషణ భారాన్ని మోస్తూన్న మావిస్ తన దు:ఖాన్ని దిగమించుకుని ఇన్నాళ్లు ఉద్యోగం కొనసాగించారు.













