అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ
ప్రపంచ శ్రేయస్సే లక్ష్యంగా అమెరికా, భారత్‌లు కలసి పనిచేయాలని ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ నిర్ణయించారు. (భారత కాలమాన ప్రకారం మంగళవారం వేకుమ ఝాము గం.1:25 నిమిషాలకు ప్రధాని మోడీ, ట్రంప్‌తో సమావేశమాయ్యరు. ఈ సమావేశంలో ఇరు దేశాల వాణిజ్య అంశాలతో పాటు ప్రపంచంలో చెలరేగుతున్న ఉగ్రవాదం, నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపైనా ఇరువురూ చర్చించుకున్నట్లు శ్వేతభవనం మీడియా కార్యదర్శి సీన్ స్పైసెర్ వెల్లడించారు. అలాగే అనేక అంశాలలో ద్వైపాక్షిక సహకారం, రక్షణ రంగంతో పాటు వివిధ రంగాలలో పరస్పర భాగస్వామ్యం తదితర అంశాలపైనా చర్చ జరిగినట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో అమెరికా 31 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటు, ప్రస్తుత పరిపాలన విధానంలో ఎదురవుతున్న లోటుపాట్లతో పాటు అంతర్జాతీయ తీవ్రవాదంపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆఫ్గనిస్తాన్ ఆర్థిక అభివృద్ధి కోసం భారత్ తీసుకున్న చర్యల పట్ల ప్రధాని మోడీని ట్రంప్ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే కాబూల్‌లో సైనిక బలగాలకు అవసరమైన హెలికాప్టర్లను అందుబాటులో ఉంచేందుకు భారత్ సంసిద్ధంగా ఉండాలని ట్రంప్ కోరినట్లు తెలుస్తోంది.













