మోదీ ప్రసంగం కోసం హ్యూస్టన్ సిద్ధం
హ్యూస్టన్‌లో ఆదివారం జరిగే ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది! ప్రధాని నరేంద్ర మోదీని ‘హౌ డు యు డు’ (హౌడీ) అంటూ ఆప్యాయంగా పలకరించి, ఆయనకు సాదర స్వాగతం పలికేందుకు ఎన్నారైలు సిద్ధమయ్యారు. భారత ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు నిర్వాహకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక్క పోప్ మినహా మరే విదేశీ నేత కూడా అమెరికాలో ఇప్పటి వరకు ఇంత భారీ కార్యక్రమం చేపట్టలేదు. దాదాపు 50 వేల మంది హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని అతిపెద్ద స్టేడియంలలో ఒకటైన ఎన్నార్జీ ఫుట్‌బాల్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు.
రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఇది తోడ్పడుతుంది’అని టెక్సాస్ ఇండియన్ ఫోరం ప్రతినిధులు వెల్లడించారు. ‘ఈ కార్యక్రమానికి దేశంలోని 50 రాష్ట్రాలకు చెందిన సెనెటర్లు, గవర్నర్లు, మేయర్లు, ప్రముఖ నేతలు హాజరవుతున్నారు. భారతీయ సమాజం భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పేలా 400 మంది కళాకారులతో గంట పాటు సాంస్క తిక కార్యక్రమం ఉంటుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుంది. హిందీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో మోదీ, ట్రంప్‌ల ప్రసంగాలు ప్రత్యక్ష ప్రసారమవుతాయి’అని తెలిపారు.
ఆదివారం జరిగే ఈ కార్యక్రమానికి వేదిక అయిన ఎన్ఆర్జీ సాకర్ స్టేడియం పరిసరాల్లో ఎక్కడ చూసినా పండగ వాతావరణం నెలకొంది. నమో అగైన్’ (మళ్లీ మోదీ) షర్ట్లు ధరించిన నిర్వాహకులు, వలంటీర్లు.. ‘నమో అగైన్’ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. భారత్-అమెరికా స్నేహబంధానికి సూచికగా స్టేడియం వద్ద ఇరుదేశాల జెండాలతో 200 కార్లతో ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు 600 మంది నిర్వాహకులు, 1500మంది వలంటీర్లు అహరహం శ్రమిస్తున్నారు. అతిపెద్ద ప్రజాస్వామ దేశాల అధినేతలు మోదీ, ట్రంప్‌లు పాల్గొననున్న ఈ కార్యక్రమంపై ఇరుదేశాల ప్రజలే కాకుండా ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.













