ఇదో మైలురాయి అవుతుంది : మోదీ
అమెరికాలోని హ్యూస్టన్లో తాను డొనాల్డ్ ట్రంప్ ఒకే వేదికపైకి రావడం ఒక వినూత్న మైలురాయి అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. హ్యూస్టన్లో హౌడీ మోదీ కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా పర్యటన వెళ్లే ముందు మోదీ పర్యటన సందేశం వెలువరించారు. అమెరికాలోని భారతీయ సంతతి వారు తనతో నిర్వహించే ఒక ఉత్సవానికి అమెరికా అధ్యక్షులు కూడా తరలిరానుండటం అపూర్వమని మోడీ స్పందించారు. భారత, అమెరికా సంబంధాలు సుస్థిర శాంతియుత, సుభిక్ష, ప్రపంచానికి దారితీస్తాయని, భద్రతాయుత, ఇచ్చిపుచ్చుకునే తరహా వాతావరణానికి తెరతీస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.













