డొనాల్డ్ ట్రంప్ కు మరో షాక్
సాక్ష్యాలను తారు మారు చేసిన కేసులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచార మేనేజన్ పౌల్ మానఫోర్ట్ జైలు పాలయ్యాడు. వ్యాపార వేత్త అయిన మానఫోర్ట్ సుదీర్ఘకాలం నుంచి రిపబ్లికన్ పార్టీలో పనిచేస్తున్నాడు. 2016లో జరిగిన ఎన్నికల్లో రష్యా జోక్యంపై జరుగుతున్న విచారణలో భాగంగా మానఫోర్ట్ ఆర్థిక అంశాలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా పనిచేయడం, మనీలాండరింగ్ వంటి కేసులను ఆయనపై నమోదు చేశారు. కానీ ఈ నేరాలను ఆయన అంగీకరించలేదు. దీంతో ఆయన ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని తగిలించి బెయిల్పై గృహనిర్బంధంలో ఉంచారు. తాజాగా స్పెషల్ కౌన్సిల్ అధికారులు మానఫోర్ట్పై సాక్ష్యాధారాలను తారుమారు చేసిన కేసు నమోదు చేశారు. ఈ కేసులో తాను నిర్దోషినని మానఫోర్ట్ పేర్కొన్నారు.













