ట్రంప్ మాజీ సలహాదారుడికి జైలు శిక్ష
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ సలహాదారుడు, ఎన్నికల సమయంలో తన మేనేజర్‌గా పనిచేసిన పాల్ మానాఫోర్ట్‌కు అమెరికా కోర్టు 47 నెల జైలు శిక్ష విధించింది. ఉక్రెయిన్ ఎన్నికల్లో రాజకీయ సలహాదారుగా పనిచేసి కొన్ని వేల కోట్ల డాలర్లు ఆక్రమంగా సంపాదించిన కేసులో కోర్టు ఇప్పటికే అతన్ని దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆయనకు శిక్ష ఖరారు చేసింది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తుకు అమెరికా ప్రభత్వుం దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. అమెరికా న్యాయ విభాగానికి చెందిన స్పెషల్ కౌన్సిల్ రాబర్ట్ ముల్లర్ తన విచారణ సమయంలో మానా ఫోర్ట్ అవినీతిని వెలికి తీశారు. శిక్ష ఖరారు సమయంలో కోర్టులో మాట్లాడిన మానా ఫోర్ట్ గత రెండు సంవ్సతరాలు తన జీవితంలో అత్యంత క్లిష్టమైనవని, వృత్తిపరంగా, ఆర్థికంగా తాను ఓడిదొడుగులు ఎదుర్కొన్నానని, శిక్ష ఖారారు సమయంలో దయ చూపాలని కోరారు. దీనికి న్యాయమూర్తి టీఎస్ ఎలిస్ స్పందిస్తూ చేసిన తప్పులకు పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ 47 నెలల జైలు శిక్ష విధించారు.













