కరోనా తర్వాతా అమెరికాకు జన ప్రవాహం
చైనాలో కరోనా విలయతాండవం మొదలైన తర్వాత ఆ దేశం నుంచి నేరుగా అమెరికాకు నడిచిన విమానాల ద్వారా మొత్తం 4.30 లక్షల మంది అగ్రరాజ్యంలోకి ప్రవేశించారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఇలా వచ్చిన వారిలో వుహాన్ నుంచి వచ్చిన వారి సంఖ్యలో వేలల్లో ఉందని వివరించింది. కరోనా వైరస్ గురించి నూతన సంవత్సరం ప్రారంభ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులకు చైనా సమాచారం ఇచ్చినప్పటి నుంచి సుమారు 4.30 లక్షల మంది చైనా నుంచి నేరుగా అమెరికాకు వచ్చారని, అధ్యక్షుడు ప్రయాణ ఆంక్షలు విధించిన తర్వాత కూడా 40 వేల మంది అగ్రరాజ్యంలోకి ప్రవేశించారని వివరించింది.













