పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యకు అమెరికాలో అరుదైన గౌరవం
పొన్నాల లక్ష్మయ్యను సత్కరించిన న్యూ జెర్సీ, పార్సిప్పనీ-ట్రాయ్ మేయర్
పొన్నాలకు ప్రశంసా పత్రాన్ని అందజేసిన మేయర్ జేమ్స్ బార్బెరియో
పొన్నాల సేవలను కొనియాడిన మేయర్ జేమ్స్ బార్బెరియో
పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యకు అమెరికాలో అరుదైనా గౌరవం లభించింది. న్యూ జెర్సీ, పార్సిప్పనీ-ట్రాయ్ హిల్స్ టౌన్షిప్ మేయర్ జేమ్స్ బార్బెరియో.. పొన్నాల లక్ష్మయ్యను సత్కరించి, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. పొన్నాల లక్ష్మయ్య దశాబ్దానికి పైగా పార్శిప్పని-టాయ్ హిల్స్‌లో నివసించారని యేయర్ ప్రశంసా పత్రంలో ప్రస్తావించారు. 1978లో తిరిగి ఇండియాకి వెళ్లి ప్రముఖ భారతీయ రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించారు. ప్రభుత్వ, పార్టీ పదవులను ఎన్నో చేపట్టారు. శాసన సభ్యులుగా, మంత్రిగా పదవులు చేపట్టి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని మేయర్ కొనియాడారు. నీటిపారుదల, సాంకేతిక రంగంలో విశేష కృషి చేసినందుకు ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు అందుకున్నారు. UNO న్యూయార్క్‌లో 5వ వార్షిక గ్లోబల్ అఫీషియల్స్ డిగ్నిటీ అవార్డ్స్‌లో డిగ్నిటరీ మ్యాన్ ఆఫ్ ఆసియా అవార్డు లభించింది. పాడిపరిశ్రమ రంగాలలో ఆయన చేసిన కృషితో పాటు పేద, వెనుకబడిన విద్యార్థులకు అందించిన సహాయాన్ని యేయర్ ప్రసంశించారు. పార్సిప్పనీ-ట్రాయ్ స్థానికుల తరఫున పలువురు ప్రవాసుల సమక్షంలో పొన్నాల లక్ష్మయ్యకు ప్రశంస ప్రాంతాన్ని అందించి, సన్మానించారు.













