సంక్రాంతివేళ…ఎపి జన్మభూమికి విరాళం
అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నారైల సహకారంతో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎన్నారైల సహకారంతో స్నేహహస్తాలు సంస్థ దత్తత తీసుకున్న పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు జయరామ్ కోమటి అంగీకరించారు. దీనికి సంబంధించి పరిఫౌండేషన్ తరపున 6,000డాలర్ల చెక్కును జయరామ్కోమటికి అందజేశారు. త్వరలోనే స్నేహహస్తాలు సూచించిన పాఠశాలల్లో ఎపి జన్మభూమి వారు డిజిటల్ తరగతులను ఏర్పాటు చేస్తున్నారు.













