అమెరికా కాంగ్రెస్ కు ఎన్నికైన తొలి ముస్లిం మహిళ
అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా 42 ఏళ్ల రషీదా తలైబ్ చరిత్ర సృష్టించనున్నారు. మిషిగన్‌లోని 13వ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్‌లో డెమోక్రటిక్ పార్టీ నామినేషన్‌ను ఆమె గెలుచుకున్నారు. ఇక్కడ నుంచి ఈ సారి రిపబ్లికన్ అభ్యర్థులెవరూ బరిలో దిగడం లేదు. దీంతో నవంబరులో జరుగనున్న ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఆమె విజయం సాధించనున్నారు. పాలస్తీనా సంతతికి చెందిన రషీదా, బ్రెండా జోన్స్‌పై పోటీచేసి డెమోక్రటిక్ నామినేషన్‌ను గెలుచుకున్నారు. ఈమె 2009 నుంచి 2014లో మిషిగన్ రాష్ట్ర శానసనకర్తగా పనిచేశారు. ఆనాడు కూడా మిషిగన్ చట్ట సభలో అడుగుపెట్టిన తొలి ముస్లిం మహిళగా అమె రికార్డు సృష్టించారు.













