వారిపై చర్యలు తీసుకుంటామన్న పాక్
తమ భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ చెప్పింది. భారత్‌లో నెలకొన్న ఉద్రికత్త పరిస్థితులను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పాక్ హామీ ఇచ్చినట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ వెల్లడించారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా ఖురేషీ ఫోన్లో ఈ విషయం చెప్పినట్లు తెలిపారు. పాకిస్థాన్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న జైషే మహమ్మద్, ఇతర ఉగ్రసంస్థలపై సరైన చర్యలు తీసుకోల్సిందిగా ఆ దేశ విదేశాంగ మంత్రి ఖురేషీతో ఫోన్లో చెప్పాను అని బోల్టన్ తెలిపారు. జైషే పుల్వామాలో జరిపిన ఆత్మాహుతి దాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. భారత్ ఉపఖండంలో తాజాగా జరిగిన పలు పరిణామాలపై వివరించేందుకు జాన్ బోల్టన్‌కు ఫోన్ చేసినట్లు పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం వెల్లడించింది. శాంతి, సుస్థిరతను పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరుకుంటున్నారని, అందుకే ఐఏఎఫ్ పైలట్‌ను భారత్‌కు అప్పగించినట్లు ఖురేషి వివరించినట్లు బోల్టన్ తెలిపారు.













