అమెరికాలో సంచలనం.. ఒకేసారి
ఫ్లాష్‌మాబ్ తరహాలో వచ్చిన కొందరు యువకులు పలు దుకాణాలు లూటీ చేసిన ఘటన అమెరికాలో సంచలనం రేపింది. ఫిలడెల్ఫియాలోని అనేక స్టోర్లపై దాదాపు వందమంది యువకులు ఒకేసారి దాడులు చేసి ఇష్టానుసారం దోచుకున్నారు. మంగళవారం రాత్రి 8:00 గంటల సమయంలో మాస్కులు, హుడీలు ధరించి సిటీ సెంటర్లోని స్టోర్లపై యువతీ యువకులు దోపిడీకి తెగబడ్డారు. చేతికి అందినది దోచుకొని అడ్డుకున్న భద్రతా సిబ్బందిపై దాడి చేసి పారిపోయారు. ఓ యాపిల్ స్టోర్‌లోకి ప్రవేశించి ఐఫోన్లు, ఐపాడ్లతో పాటు ఇతర వస్తువులన్నింటినీ వారు దోచుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటి వరకు 52 మందిని అరెస్టు చేశారు. వీరిలో కొందరి నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీరంతా సోషల్ మీడియాలో సమన్వయంతోనే ఈ దోపిడీకి పన్నాగం పనినట్లు కనిపిస్తోంది నగర ఇన్ఛార్జ్ కమిషనర్ జాన్ స్టాన్‌ఫర్డ్ తెలిపారు. నగరం మొత్తం కార్లలో తిరుగుతూ దుకాణాల్లోకి చొరబడ్డారని తెలిపారు.













