అమెరికాలో ఆరుబయట బడులు!
అమెరికాలో ఆరుబయట బడులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యలో బడులు ఎలా తెరవాలో అర్థం కాని స్థితిలో ఉన్న అమెరికా విద్యాసంస్థలకు.. నిపుణులు ఈ సరికొత్త పద్ధతిని సూచిస్తున్నారు. ఇలా అయితే వైరస్ వ్యాప్తి ప్రమాదం ఉండదని, భౌతికదూరం పాటించడం కూడా సులువవుతందని చెబుతున్నారు. ఈ దిశగా ఇప్పటికే కొన్ని స్కూళ్లు ఆరుబయట టెంట్లు కూడా నిర్మించేశాయి. విద్యార్థుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లూ చేసేస్తున్నాయి. ఇంతకాలం ఏసీ తరగతి గదుల్లో పాఠాలు విని విసుగెత్తిపోయిన అక్కడి విద్యార్థుల్లో ఈ సరికొత్త విద్యావిధానం నూతనోత్సాహాన్ని నింపుతోంది.













