Suchir Balaji: సుచిర్ బాలాజీ ఎలా చనిపోయాడు?
శాన్ ఫ్రాసిస్కో(San Francisco) నగరం లో క్యూపర్టినో ప్రాంతంలో వుండే 26 ఏళ్ల యువకుడు సూచిర్ బాలాజీ(Suchir Balaji) మరణం గురించి అమెరికా లో ముఖ్యంగా కాలిఫోర్నియా లో వినిపిస్తున్న కథనాలు క్లుప్తంగా ఏం చెపుతున్నాయి? …
కాలిఫోర్నియా యూనివర్సిటీ, బర్కిలీ లో MS చదివిన 20 ఏళ్ల యువకుడు సూచీర్ బాలాజీ Open AI అనే సంస్థ లో 2018 లో ఒక Intern గా చేరాడు. అతని తెలివి తేటలు చూసి కంపెనీ వెంటనే అతనికి ఎంప్లాయిమెంట్ ఇచ్చి Web GPT ప్రాజెక్టు లో పెట్టింది. అతనిని తరువాత Chat GPT లోకి పంపించారు. సుచిర్ బాలాజీ తెలివితేటలు అమోఘం. అతని సేవలు మా కంపెనీ కి ఎంతో ఉపయోగ పడ్డాయి అని Open AI కంపెనీ సీనియర్ ఆఫీసర్ అప్పట్లోనే అందరితో చెప్పేవారు.
అయితే రాను రాను రాను చేస్తున్న పనిలో కంపెనీ ఫెడరల్ లాస్ ని ఫాలో అవడం లేదని సుచీర్ కి అర్ధం అయి 2024 ఆగస్టు లో తాను పను చేస్తున్న Open AI కి రాజీనామా చేసి బయటకు వచ్చేసాడు. నవంబర్ 2024 లో తన అనుభవాలు, అభిప్రాయాలు వివరిస్తూ ఒక పెద్ద ఆర్టికల్ కూడా రాయటం, అది న్యూ యార్క్ టైమ్స్ లో ప్రచురించటం జరిగింది.
అప్పటికే Open AI మీద కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు ఈ విషయం పై పిర్యాదులు చేయడం, కోర్టు కి కూడా వెళ్లడం వలన సుచిర్ కథనానికి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది.
ఈ నేపథ్యం లో 26 నవంబర్ తేదిన సుచిర్ బాలాజీ చనిపోయినట్లుగా తెలిసింది. పోలీసు, మెడికల్ వారి కథనం ప్రకారం సుచిర్ కూపర్టినో లో తన అపార్ట్మెంట్ లో చనిపోయినట్టు, బహుశా ఆత్మ హత్య చేసుకొన్నట్టు తెలుస్తోంది.
సుచిర్ తల్లి తండ్రులు పూర్ణిమ రామారావు, బాలాజీ రామ మూర్తి మాట్లాడుతూ సుచిర్ మొదటి నుంచి చాలా తెలివైనవాడని మరియు ధైర్యస్తుడని , ఆత్మ హత్య చేసుకొనే మనిషి కాదని అంటున్నారు..
కార్పొరేట్ సంస్థలు సుచిర్ లాంటి ప్రశ్నించే వ్యక్తులను తొలగించుకొంటాయని, అవసరం అయితే దేశం నుంచి పంపించెటమో చేస్తాయని, కొన్ని సంస్థలు ఇంకా ముందుకెళ్తాయని కొందరు అనుకుంటున్నారని తెలిసింది.







