డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నికైతే ఆ సమస్య ఉండదు
అమెరికా, ఐరోపా దేశాల్లో 9/11 తరహా ఉగ్రదాడులు జరగొచ్చని ఒసామా లాడెన్ సవతి అన్న కూతురు నూర్ లాడిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నికైతే ఆ సమస్య ఉండదు. ట్రంప్ ఉగ్రవాదాన్ని సమర్థంగా నిర్మూలించగలిగారు. జో బిడెన్ ఎన్నికైతే ఉగ్రవాదులు రెచ్చిపోయే ప్రమాదముంది. ఒబామా, బిడెన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు వేగంగా విస్తరించారు. మళ్లీ ట్రంప్ వస్తేనే ఉగ్రవాద సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని అమె అభిప్రాయపడ్డారు.
నూర్ తల్లి స్విడ్జర్లాండ్కు చెందిన రచయిత్రి కార్మెన్ డూఫోర్ కాగా, ఆమె తండ్రి ఒసామా బిన్ లాడెన్ సవతి అన్న యెస్లామ్. నూర్ స్విడ్జర్లాండ్ జాతీయురాలే అయినా.. అమెరికాలో స్థిరపడాలని, విలాసవంతమైన వాహనంలో దేశమంతా తిరిగాలనేది అమె చిరకాల వాంఛ. నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తరపున ప్రచారానికి తాను సిద్ధమేనని నూర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ట్రంప్ మరోమారు అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం వల్ల అమెరికాతోపాటు, ఉగ్రవాద పీడిత దేశాలకు కూడా మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.













