దక్షిణాసియాకు ‘అణు’ ముప్పు : అమెరికా ఇంటెలిజెన్స్ హెచ్చరిక
భారత్-పాకిస్థాన్ దేశాలు నిర్వహిస్తున్న అణ్వస్త్ర పెంపుదల కార్యక్రమాలతో దక్షిణాసియాలో భద్రతకు పెను ముప్పు వాటిల్లుతుందని అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ హెచ్చరించింది. 2019లో అంతర్జాతీయ భద్రతా పరిస్థితిపై తమ అంచనాలను కాంగ్రెస్ సభ్యులకు వివరించిన అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ డేనియట్ కోట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. షార్ట్ రేంజ్ టాక్టికల్ ఆయుధాలు, సముద్ర ఆధారిత క్రూయిజ్ క్షిపణులు, గగనతల క్రూయిజ్ క్షిపణులు, లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ వంటి కొత్త తరహా అణ్వస్త్ర తయారీలో పాక్ తన కార్యకలాపాలను కొనసాగిస్తుండగా భారత్ మాత్రం ఈ ఏడాది తాను దేశీయంగా అభివృద్ధి అణు జలాంతర్గామిని ప్రవేశపెట్టిందని తెలిపారు.













