ఎన్నారైవిఎ గ్లోబల్ కన్వెన్షన్ కిక్ ఆఫ్ ఈవెంట్ సక్సెస్
అమెరికాలోని ఎన్నారై వాసవీ అసోసియేషన్ (ఎన్నారై విఎ) ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను వేడుకలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే సంవత్సరం జూలై 4,5,6 తేదీల్లో సెయింట్ లూయిస్‌లో నిర్వహించే ఎన్నారై విఎ 7వ గ్లోబల్ కన్వెన్షన్‌ను పురస్కరించుకుని కిక్ ఆఫ్ ఈవెంట్‌ను ఇటీవల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నారై విఎ ఏర్పాట్కె 15 సంవత్సరాల పూర్తయిన వేడుకలను కూడా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు, ప్రస్తుత అధ్యక్షులు, వారి కార్యనిర్వాహక వర్గం, బోర్డ్ ట్రస్టీలు, రీజినల్ డ్కెరెక్టర్లు, కమిటీ చ్కెర్స్, మెంబర్స్, ఛాప్టర్ నాయకులు, దాతలు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 200మందికిపైగా సభ్యులు వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.
బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో పలు విషయాలను చర్చించారు. సెయింట్ లూయిస్ ఎన్నారై విఎ టీమ్ ఏర్పాటు చేసిన విందు అందరి అభిమానాన్ని చూరగొంది. వేడివేడిగా ఉన్న ఆహారపదార్ధాలు, ఇంటి రుచిని అందించేలా తయారు చేసి వడ్డించిన తీరు ఎంతోమందికి సంతోషాన్ని కలిగించింది. సెయింట్ లూయిస్ హిందూ దేవాలయమును సందర్శించి వాసవి మాతను పూజించిన తరువాత కన్వెన్షన్ కిక్ఆఫ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా సంప్రదాయంగా జ్యోతి వెలిగించి ప్రార్థన, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ మెప్పించాయి. కన్వెన్షన్‌ను వైభవంగా నిర్వహించేందు కోసం విరాళాలను సేకరించి ముఖ్యమైన ఘట్టాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఐ2 టీమ్ ఆధ్వర్యంలో వెలువడిన వాసవి వాణి మొదటి ఎడిషన్‌ను ఆవిష్కరించారు, ‘‘అలనాటి రుచులు’’ పేరుతో ఒకప్పటి వంటకాలను కలిగి ఉన్న ఇ-బుక్ మరియు జీవిత సభ్యులందరికీ ప్రోత్సాహకాలు అభినందనలు వంటి కార్యక్రమాలన్ని దాతలు, ఇతరుల సహకారంతో విజయవంతంగా జరిగాయి.
ఈ సందర్భంగా 2024లో జూలైలో కన్వెన్షన్ జరిగే ప్రాంతమైన అమెరికా సెంటర్ ప్రాంతాన్ని నాయకులు, సభ్యులు చూశారు. కన్వెన్షన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకోసం కన్వెన్షన్ కన్వీనర్‌గా ఎల్ఎన్ రావు చిలకలను, కన్వెన్షన్ కో-కన్వీనర్‌గా వంశీ గుంటూరు, కన్వెన్షన్ సెక్రటరీగా ఫణిషా కోడూరి, కన్వెన్షన్ ట్రెజరర్/కోఆర్డినేటర్‌గా శేఖర్ పేర్ల లను నియమించారు. అసోసియేషన్ చరిత్రలో మొదటిసారిగా ఓ మహిళను కన్వెన్షన్ సెక్రటరీగా ఫణిషా కోడూరిని నియమంచి మహిళాభ్యుదయానికి స్వాగతం పలికారు.
అసోసియేషన్ 15సంవత్సరాల జర్నీని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కేక్‌ను అధ్యక్షుడు శ్రీనివాసరావు పందిరి కట్ చేశారు. ఈ వేడుకను విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.













