విదేశాల్లో చంద్రబాబుకు సంఫీుభావ ప్రదర్శనలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు విదేశాల్లో సైతం తెలుగువారు సంఫీుభావాన్ని ప్రకటిస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బెల్జియం, మలేషియా, దుబాయ్, ఆస్ట్రేలియా, టాంజానియా, సౌత్ ఆఫ్రికా, అమెరికా దేశాల్లో తెలుగు వారు మద్దతుగా నిలిచి ప్రదర్శనలు నిర్వహించారు. అమెరికాలోని డల్లాస్, వాషింగ్టన్ డీసీ, హాట్ఫోర్డ్లలో ఎన్నారైలు ప్రదర్శనలు నిర్వహించి చంద్రబాబు అరెస్ట్‌పై నిరసనను వ్యక్తం చేశారు. అలాగే దుబాయ్‌లో సౌత్ ఆఫ్రికాలో ఎన్నారై టీడీపీ సభ్యులు నిరసన దీక్షలు నిర్వహించారు. దుబాయ్‌లోని జేబెల్లో అలీ హిందూ టెంపుల్లో ఎన్నారైలు పసుపు టీ షర్ట్లు ధరించి నిరసన దీక్ష చేపట్టారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఎన్నారైలు కార్ల ర్యాలీ నిర్వహించారు.













