డ్వాబ్ అంధుల స్కూల్ కు ఎన్ఆర్ఐల విరాళం
నల్గొండ జిల్లాలో డ్వాబ్ సంస్థ నిర్వహిస్తున్న అంధుల పాఠశాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం డబ్లిన్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు మేకల ప్రబోధ్ రెడ్డి, యల్క ప్రదీప్ రెడ్డి, కందకూరి శ్రీనివాసులు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా డ్వాబ్ సంస్థ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు, కోశాధికారి ఎన్ పరమేశంలు ఆ ముగ్గురికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మానవ సేవే మాధవ సేవగా భావించి అంధుల పాఠశాల నిర్వహణ కోసం విరాళం అందజేశామని ప్రబోధ్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాసులు తెలియజేశారు.













