ఎన్నారై వాసవీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
ఎన్నారై వాసవీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను వివిధ ప్రాంతాల్లో వైభవంగా నిర్వహించడంతోపాటు, మార్చి నెలను చరిత్ర సృష్టించిన మహిళల నెలగా ప్రకటించినట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు పందిరి తెలిపారు. ఐ 2 టీమ్ వ్యూహంలో భాగంగా పేరుగాంచిన మహిళల విజయగాథలను తెలపడంతోపాటు, మహిళా దినోత్సవ వేడుకలను అమెరికా నగరమంతా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎన్నారై వాసవీ ఛాప్టర్ల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎంతోమంది మహిళలు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.
ఆల్బనీ, బే ఏరియా, బోస్టన్, అట్లాంటా, ఛార్లెట్, డల్లాస్, కొలంబస్, డిట్రాయిట్, హ్యూస్టన్, ఇండియానా, జాక్సన్విల్లే, కాన్సాస్, లాస్ ఏంజెల్స్, మేరీలాండ్, మెంపిస్, మిల్వాకీ, మియామీ, పిట్స్బర్గ్, న్యూజెర్సి, రాలే, రోడ్ ఐలాండ్, రిచ్మండ్, శాన్ ఆంటోనియో, శాన్‌డిగో, సెయింట్ లూయిస్, టంపా, వర్జీనియా తదితర ప్రాంతాల్లో ఉన్న వాసవీ ఛాప్టర్ల మహిళా విభాగం ఆధ్వర్యంలో ఉమెన్స్ డే వేడుకలను వైభవంగా జరిపారు. దాదాపు 2,000మందికిపైగా మహిళలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత, స్ఫూర్తిదాయక కార్యక్రమాలను నిర్వహించారు.













