ఎన్ఆర్ఐవిఎ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు : అధ్యక్షుడు శ్రీనివాసరావు పందిరి
ఎన్ఆర్ఐ వాసవీ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నెల 3 నుంచి 5 వరకు సెయింట్ లూయిస్‌లో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. వాసవీ మాతకు పూజ చేసిన అనంతరం కొత్త ప్రెసిడెంట్‌గా శ్రీనివాసరావు పందిరి బాధ్యతలు చేపట్టారు. ఆయనతోపాటు జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీలు, జాయింట్ ట్రెజరర్లు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు, రీజినల్ డైరెక్టర్లు, స్టాండింగ్ కమిటీ చైర్లు, స్టాండింగ్ కమిటీ కో-ఛైర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్ఆర్ఐ వాసవీ అసోసియేషన్ నేతలంతా భగవద్గీత, వాసవీ మాతపై ప్రమాణం చేసి తమ పదవులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి 250 మందికిపైగా సభ్యులు, ఇతరులు హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీమ్ఐ2 టర్మ్ లోగోను కూడా ఆవిష్కరించారు. ప్రేరణ-ప్రభావం అనేది ట్యాగ్ లైన్‌గా పెట్టుకున్నారు. అలాగే బోర్డు సభ్యులంతా సమావేశమై 2023-2024కు విజన్‌ను ప్రతిపాదించారు.
తరువాత సెయింట్ లూయిస్‌లోని వాసవీ మాత ఆలయంలో పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక కుటుంబాలన్నీ కలిసి టార్చ్ పాసింగ్ వేడుకను నిర్వహించాయి. ఈ క్రమంలో మాజీ ప్రెసిడెంట్ హరి రైనీ టార్చ్‌ను కొత్త ప్రెసిడెంట్ శ్రీనివాసరావు పందిరికి అందించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 500 మందికిపైగా ఎన్‌ఆర్‌ఐవీఏ సభ్యులు, అభిమానులు, ఇతరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2023-2024 అభివృద్ధి ప్రణాళికను నూతన ప్రెసిడెంట్ ప్రవేశపెట్టి కొత్త కార్యవర్గం తరపున నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. అనంతరం పుస్తకమిత్ర: రీడ్ టు లీడ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో పాటు గోమాత, యూత్ ఎంట్రప్రెన్యూర్షిప్ ప్రోగ్రాం కూడా లాంచ్ చేశారు. అలాగే మార్చి నెలను ఎన్‌ఆర్‌ఐవీఏ మహిళల నెలగా ప్రకటించారు. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కృషి చేసిన 60 మందికిపైగా వాలంటీర్లు, ఎన్‌ఆర్‌ఐవీఏ నాయకులు అందరికీ నూతన ప్రెసిడెంట్ శ్రీనివాసరావు పందిరి అభినందనలు తెలుపుతూ, వీళ్లంతా రెండు నెలలుగా ఈ వేడుకను నిర్వహించేందుకు కృషి చేశారని, వారందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు.
పుస్తకమిత్ర
ఎన్‌ఆర్‌ఐవీఏ టీమ్ఐ2 తరపున ఈ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా అమలు చేయనున్నట్లు ప్రెసిడెంట్ శ్రీనివాసరావు పందిరి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో లైబ్రరీలను ఏర్పాటు చేయడంతోపాటు పుస్తకాలను కూడా అందించనున్నట్లు చెప్పారు. విద్యార్థులకు చదువుకోవడంపై ఆసక్తి కలిగించేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నామని, ఈ కార్యక్రమం ప్రకటించిన మొదటిరోజే సభ్యులు దాదాపు కోటి రూపాయలకు పైగా మూల నిధిని అందించడం చాలా సంతోషంగా ఉందని, ఈ నిధులతో ఈ పుస్తక మిత్ర కార్యక్రమాన్ని అవసరమైన చోట్ల లైబ్రరీల స్థాపనకు, పుస్తకాల కొనుగోళ్ళకు వినియోగించనున్నట్లు చెప్పారు.
గోమాత
గోమాత కార్యక్రమం ద్వారా గోశాలలకు ఆర్థిక సహాయాన్ని తమ సంస్థ తరపున అందిస్తామని చెప్పారు. భారతదేశంలోని గోశాలలకు ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతోపాటు ఇతర చోట్ల కూడా అవసరమైతే సహాయాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని శ్రీనివాసరావు పందిరి తెలిపారు. గోమాత సంరక్షణకు తమ సంస్థ కృషి చేస్తుందన్నారు.
యూత్‌కు ప్రోత్సాహం
అలాగే ఇతర సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే, మరోవైపు యూత్‌ను కమ్యూనిటీ సర్వీస్‌లో పాలుపంచుకునేలా చూడటంతోపాటు, వారిలో నాయకత్వ అభివృద్ధికి సంస్థ తరపున కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. యూత్ ఎంట్రప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్‌తో పాటు, ఆడిట్, అసెట్ మేనేజ్మెంట్, గ్రీవెన్స్, విమెన్ ఇన్ టెక్నాలజీ వంటి ఇతర కమిటీలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఆకలిని నిర్మూలించాలనే లక్ష్యంతో నిరుపేదలకు 1 మిలియన్ మీల్స్ విరాళాన్ని పూర్తి చేసింది. అలాగే ప్రెసిడెంట్ ఎలెక్ట్‌గా రమేష్ బాపనపల్లిని ఎన్నుకున్నామని అంటూ, టీమ్‌తో కలిసి సంస్థను మరింత ముందుకు తీసుకు వెళ్ళడంతోపాటు అంతర్జాతీయ సంస్థగా దీనిని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, ఒక్లహోమాతోపాటు, కెనడాలో కూడా ఎన్‌ఆర్‌ఐవీఏ శాఖను ప్రారంభించినట్లు శ్రీనివాసరావు పందిరి తెలిపారు.
కొత్త కార్యవర్గం
శ్రీనివాసరావు పందిరి (ప్రెసిడెంట్)
రమేష్ బాపనపల్లి (ప్రెసిడెంట్ ఎలెక్ట్)
హరి రైని (పాస్ట్ ప్రెసిడెంట్)
డా. జయసింహ సుంకు (పాస్ట్ చైర్మన్)
ప్రవీణ్ తడకమళ్ళ (కార్యదర్శి)
గంగాధర్ ఉప్పల (ట్రెజరర్)
కిషోర్ కొండూరు (జాయింట్ సెక్రటరీ)
ఫణీశ కోడూరి (జాయింట్ సెక్రటరీ)
ప్రవీణ్ ఆముదాల (జాయింట్ ట్రెజరర్)
శేఖర్ పేర్ల (జాయింట్ ట్రెజరర్)
ఇసి సభ్యులు – హరినాథ్ యక్కలి, లక్ష్మణ్ కాపర్తి, మహేష్ జేమొళ్ళ, రాజేష్ బాదం, రాంకీ చౌడారపు, రవి ఇల్లెందుల, సంతోష్ వెల్లూరు, శ్రీనివాస్ చిట్టిమళ్ళ, సునీత రాచపల్లి, సురేష్ బాదం, వెంకట్ బెల్దె.
బోర్డ్ సభ్యులు – అనిల్ గ్రంథి, భాను ఇల్లెంద్ర, డా. జయశ్రీ చిట్లూరి, డా. రాములు సముద్రాల, డా. రవి మాకం, డా. రోజానందం సముద్రాల, డా. శ్రీనివాస్ సీల, డా. వేణు కొంద్లె, హనుమాన్ నందనంపాటి, లక్ష్మీ కాంభోజి, ఎల్ఎన్ రావు చిలకల, రాజా పంపటి, రవి పెద్ది, శ్యామ్ పడమటింటి, శ్రీనివాస్ వీరవెల్లి, శ్రీనివాస చిత్తలూరి.













