Sam Joshi: ఎడిసన్ మేయర్ ఎన్నికల్లో శామ్ జోషీకి తెలుగు కమ్యూనిటీ మద్దతు
న్యూజెర్సీ (New Jersey) లో నివసించే ఎన్నారై తెలుగు కమ్యూనిటీ ఎడిసన్ నగర మేయర్ ఎన్నికల్లో శామ్ జోషీకి మద్దతును ప్రకటించింది. న్యూజెర్సీలోని ఎడిసన్ రాష్ట్రంలో భారతీయులకు ఎక్కువ సంఖ్యలో ఉన్న సంగతి తెలిసిందే. తెలుగువారు కూడా ఇక్కడ ఎక్కువగానే కనిపిస్తుంటారు. వారాంతాల్లో మరియు వారం రోజులలో కూడా ఎల్లప్పుడూ ఎన్నారైల కార్యకలాపాలతో ఈ ప్రాంతం సందడిగా కనిపిస్తుంటుంది. ఎడిసన్ మేయర్ శామ్ జోషీ తెలుగు కమ్యూనిటీ నాయకులకు మరియు తెలుగు సంఘాల కార్యవర్గ సభ్యులందరికీ ఆప్తుడు, తెలుగువారు నిర్వహించే చాలా కార్యకలాపాలకు ఆయన మద్దతు ఇవ్వడమేకాకుండా ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు శామ్ జోషీ మళ్లీ మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా తన గెలుపుకు అండగా నిలవాల్సిందిగా తెలుగు కమ్యూనిటీని కోరారు. పలువురు తెలుగు కమ్యూనిటీ నాయకులు ఆయనకు తమ మద్దతును ఇప్పటికే తెలియజేశారు.







