డల్లాస్ మహానాడుకు వస్తున్న ప్రముఖులు
అమెరికాలో మొదటిసారిగా ఎన్నారై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డల్లాస్ నగరంలో మే 27,28 తేదీల్లో నిర్వహిస్తున్న మహానాడుకు రాష్ట్రం నుంచి పలువురు ప్రముఖులు, మంత్రులు హాజరవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి పెద్దసంఖ్యలో అతిథులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని నిర్వాహకులు తెలిపారు. మంత్రి గంటా, ఎంపీ సీ.ఎం.రమేష్, శాసనసభ్యులు కదిరి బాబూరావు, అనగారి సత్యప్రసాద్, తెతెదేపా కార్యదర్శి పెద్దిరెడ్డి, గాయకులు కౌసల్య, సింహా, శ్రీలక్ష్మీ, సందీప్ తదితరులు వేడుకలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అమెరికా నలుమూలలా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ఈ వేడుకల్లో పాల్గొనాలని వారు కోరారు.













