ప్రవాసాంధ్ర వైద్యుడు ప్రేమ్‍రెడ్డి… 500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు విరాళం

అమెరికాలో ప్రముఖ వైద్యునిగా, పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన ప్రవాసాంధ్రుడు ప్రేమ్‍రెడ్డి కొవిడ్ రోగులకు సహాయం అందించారు. 500 ఆక్సిజన్ కాన్సన్‍ట్రేటర్లు, ఇతర వైద్య పరికరాలను ఇండియన్ రెడ్‍క్రాస్ సొసైటీకి పంపినట్లు సొసైటీ ఏపీ విభాగం గౌరవాధ్యక్షుడు డా.ఎ. శ్రీధర్‍రెడ్డి తెలిపారు. అమెరికాలోని ఒంటారియోలో ప్రైమ్ హెల్త్కేర్ గ్రూప్‍ను స్థాపించిన ప్రేమ్‍రెడ్డి, ప్రస్తుతం దానికి చైర్మన్‍గా వ్యవహరిస్తున్నారు. ప్రైమ్ హెల్త్ కేర్ గ్రూప్‍నకు అమెరికాలో 14 రాష్ట్రాల్లో 46 ఆసుపత్రులు, 300పైగా అవుట్ పేషెంట్ కేంద్రాలు ఉన్నాయి. భారత్‍లోని కొవిడ్ రోగుల చికిత్సకు అవసరమైన వైద్య పరికరాలు సరఫరా చేసేందుకు, అమెరికా అధికారులు, పార్లమెంటు సభ్యులతో కలసి ప్రేమ్‍రెడ్డి పనిచేస్తున్నారు.