భారత్ పర్యటనపై నిర్ణయం తీసుకోలేదు
ప్రతి ఏటా గణతంత్ర వేడుకలకు ఓ దేశాధినేతను భారత్ ఆహ్వానిస్తుంది. అలాగే వచ్చే ఏడాది ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆహ్వానం పంపించింది. భారత్ ఆహ్వానం అందిందని, అయితే ట్రంప్ పర్యటనపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని యూఎస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ వెల్లడించారు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనున్నారు. వచ్చే ఏడాది ట్రంప్ రాకపై వారు భారత అధికారులతో చర్చిస్తారని శాండర్స్ తెలిపారు. 2015లో అప్పటి అధ్యక్షుడు ఒరాక్ ఒబామా రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పుడు మరోసారి అమెరికా అధ్యక్షుడికి మోడీ ప్రభుత్వం ఆహ్వానం పంపించింది.













