అమెరికాలో ఆ స్టేడియం ..ఇక కనిపించదు
ప్రస్తుత టి20 ప్రపంచకప్ కోసం న్యూయార్క్‌లో కేవలం 106 రోజుల్లో శరవేగంగా నిర్మించిన నాసా కౌంటీ క్రికెట్ స్టేడియాన్ని కూల్చివేయనున్నారు. ఆస్ట్రేలియా (అడిలైడ్)లో తయారు చేసిన డ్రాప్ ఇన్ పిచ్‌లతో న్యూయార్క్‌లో నాసా స్టేడియాన్ని 34 వేల సీట్ల సామర్థ్యంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాత్కాలికంగా నిర్మించింది. వెస్టిండీస్‌తో కలిసి మెగా ఈవెంట్‌కు అమెరికాలోని న్యూయార్క్, ఫ్లోరిడా, డాలస్ వేదికలు ఆతిథ్యమిస్తున్నాయి. కేవలం ఇక్కడ లీగ్ దశనే జరుగుతుంది. న్యూయార్క్‌లోని నాసా స్టేడియం 8 మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. ఇండో` అమెరికన్లు అధిక సంఖ్యలో ఉండటంతో ఇక్కడ భారత్, బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్ సహా నాలుగు మ్యాచ్‌ల్ని ఆడిరది. 9న భారత్, పాక్ సమరం ఇక్కడే జరిగింది. ఐసీసీ ఊహించినట్లుగానే భారత అభిమానుల కోలాహలంతో స్టేడియం నిండిపోయింది. ఇక్కడ మ్యాచ్‌ల నిర్వహణ పూర్తి కావడంతో నేటి నుంచి కూల్చివేత పనులు ప్రారంభించి ఆరు వారాల్లో గతంలో ఎలా ఉందో అలాంటి యథాతథస్థితికి తీసుకొస్తారు.







