రుచికరమైన చెప్పులు.. నోరూరించే చెప్పులు
నోరూరించే చెప్పులేమిటి? వాటిని తినడమేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే. వాటిని లొట్టలు వేసుకుంటూ తినేయవచ్చు. న్యూజెర్సీలో ఉన్న ఒక స్టోర్ ముందు ఇలా కస్టమర్లు చెప్పులను కొనుక్కుని, వాటికి రుచికరమైన క్రీములను రాసుకుని మరీ తినేందుకు బారులు కడుతుంటారు. ఒక క్యాండీ స్టోర్ హై హీల్స్ ఆకారంలో చాక్లెట్లను తయారు చేస్తూ విక్రయిస్తుండడంతో, వాటిని జివ్వాచాపల్యం తీరేంత వరకూ తింటూ ఉంటారు. మామూలుగా చూస్తే, ఇవి చాక్లెట్లేనా అన్న అనుమానం వచ్చేలా వీటిని తయారు చేస్తుండడం గమనార్హం. అందుకే వీటికి అంత డిమాండ్.













