భారత్-పాక్ న్యూయార్క్ భేటీ రద్దు
భారత్‌తో శాంతిచర్చలకు తాము సిద్ధమేనన్న పాకిస్థాన్‌కు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ద్వైపాక్షిక చర్చలను పునరుద్ధరించాల్సిందిగా పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ రాసిన లేఖను భారత్ తిరస్కరించింది. కాశ్మీర్ సరిహద్దుల్లో ఒక బిఎస్ఎఫ్ జవాను, ముగ్గురు ఎస్‌పిఒ లకు పాక్ ముష్కరులు దారుణ హత్య చేసిన నేపథ్యంలో భారత్ విదేశాంగ మంత్రుల చర్చలు భేటీని రద్దు చేసినట్లు ప్రకటించింది. ఇరుదేశాల మధ్య మంచి సంబంధాలను పునరుద్ధరించే ప్రక్రియాలో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాలకు హాజరయ్యే భారత్ పాక్ విదేశాంగ మంత్రులు భేటీ కావాలని ఇమ్రాన్ ఇటీవల రాసిన లేఖలో ప్రతిపాదించారు. ఓవైపు చర్చలకు సిద్ధమంటూనే సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్‌తో చర్చలకు భారత్ ప్రభుత్వం ససేమిరా రాబోమని తెగేసి చెప్పింది.













