ఫ్లోరిడాలో నాట్స్ సేవలు
‘భాషే రమ్యం సేవే గమ్యం’ అని నినదించే నాట్స్ తాజాగా ప్లోరిడాలో హాబిటేట్స్ ఫర్ హ్యూమానిటీ రిస్టోర్ అనే సంస్థ కోసం తన వంతు సేవలు అందించింది. పేదల కోసం ఇళ్లు, ఇంట్లో సామాన్లు, ఇతర వసతి సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా హాబిటేట్స్ ఫర్ హ్యూమానిటీ అనే సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థకు చాలా మంది విరాళాలు, సామానులు అందించడంతో పాటు తమకు తోచిన సేవలను కూడా ఉచితంగా అందిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ కూడా తన సేవలను అందిచేందుకు నడుంబిగించింది. టెంపా బే నాట్స్ ఛాప్టర్ సభ్యులు ఈ సంస్థలో టాప్స్, టేబుల్స్ కోసం తమ విలువైన సేవలను అందించారు.
రోజువారీ పనుల్లో ఎంతో బీజీగా గడిపే నాట్స్ సభ్యులు హాబిటేట్ ఫర్ హ్యూమానిటి రిస్టోర్‌లో అనేక పనులు చేసి పేదల పట్ల తమకు ఉండే ప్రేమను చాటుకున్నారు. పేదలకు అందించే వస్తువులను సిద్ధం చేయడంలో ఎంతో సంత ప్తినిచ్చిందని నాట్స్ టెంపా బే ఛాప్టర్ సభ్యులు తెలిపారు. హబిటేట్ ఫర్ హ్యూమానిటీ రిస్టోర్ వేర్ హౌస్‌ను క్లీనింగ్ కూడా చేసి ఆ సంస్థ ప్రశంసలను నాట్స్ సభ్యులు పొందారు.













