హాబిటేట్స్ ఫర్ హ్యూమానిటీ రిస్టోర్ లో నాట్స్ సేవలు
పేదల కోసం మేము సైతం అంటూ ముందుకొచ్చిన నాట్స్
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ టెంపాలోని ప్లోరిడాలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. భాషే రమ్యం సేవే గమ్యం అని నినదించే నాట్స్ తాజాగా ప్లోరిడాలో హాబిటేట్స్ ఫర్ హ్యూమానిటీ రిస్టోర్ అనే సంస్థ కోసం తన వంతు సేవలు అందించింది. పేదల కోసం ఇళ్లు, ఇంట్లో సామానులు.. ఇతర వసతి సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా హాబిటేట్స్ ఫర్ హ్యూమానిటీ అనే సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థకు చాలా మంది విరాళాలు, సామానులు అందించడంతో పాటు.. తమకు తోచిన సేవలను కూడా ఉచితంగా అందిస్తారు. ఈ క్రమంలోనే నాట్స్ కూడా తన సేవలను అందిచేందుకు నడుంబిగించింది.
టెంపా బే నాట్స్ ఛాప్టర్ సభ్యులు.. ఈ సంస్థలో టాప్స్, టేబుల్స్ కోసం తమ విలువైన సేవలను అందించారు. రోజువారీ పనుల్లో ఎంతో బీజీగా గడిపే నాట్స్ సభ్యులు హాబిటేట్ ఫర్ హ్యూమానిటి రిస్టోర్ లో అనేక పనులు చేసి పేదల పట్ల తమకు ఉండే ప్రేమను చాటుకున్నారు. పేదలకు అందించే వస్తువులను సిద్ధం చేయడంలో ఎంతో సంతృప్తినిచ్చిందని నాట్స్ టెంపా బే ఛాప్టర్ సభ్యులు తెలిపారు. హబిటేట్ ఫర్ హ్యూమానిటీ రిస్టోర్ వేర్ హౌస్ ను క్లీనింగ్ కూడా చేసి ఆ సంస్థ ప్రశంసలను నాట్స్ సభ్యులు పొందారు.













