కోవిడ్ బాధితులకు నాటా ఆసరా…. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఇతర పరికరాల పంపిణీ

కోవిడ్ బాధితులకు నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభ్యులు ముందుకు వచ్చి సహాయం అందిస్తున్నారని నాటా అధ్యక్షులు డాక్టర్ గోసల రాఘవ రెడ్డి ఒక ప్రకటనలో తెలియచేసారు. కోవిడ్ మహమ్మారి విజృంభణతో కకావికలమైన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆసుపత్రులలో ఎక్కువ భాగం పూర్తి సామర్థ్యం తో నిర్వహించబడుతున్నాయి. అనేక ఆసుపత్రులలో ఆక్సిజన్ తో వున్నఆసుపత్రి బెడ్ పొందడం ఒక సవాలుగా మారింది. కొంతమంది రోగులకు ఆక్సిజన్ సౌకర్యం ఉంటే ఇంటి లో వుండి ఆసుపత్రికి వెళ్లకుండా కొంతవరకు మేనేజ్ చేసుకొనే అవకాశం వుంది. అక్కడే నాటా సభ్యులు ముందుకు వచ్చి ఆంధప్రదేశ్ మరియు తెలంగాణ లోని పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, పల్స్ ఆక్సిమీటర్లు, మెడికల్ కిట్లపై నాటా ప్రత్యేక దృష్టి పెట్టింది. కోవిడ్ సమస్యల కారణంగా కుటుంబంలో యజమాని చనిపోయినప్పుడు కోవిడ్ వలన ప్రభావితమైన కుటుంబాలపై కూడా ద•ష్టి సారించింది.
నాటా అడ్వైజరీ కౌన్సిల్ చైర్ ఎమెరిటస్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి 500 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, మరియు ఇతర అవసరమైన వైద్య సామాగ్రిని ఆంధప్రదేశ్‍కు విరాళంగా ఇచ్చారు. డాక్టర్ ప్రేమ్ రెడ్డి స్థాపించిన ప్రైమ్ హెల్త్ కేర్ 14 రాష్ట్రాల్లో 46 ఆస్పత్రులు కలిగి ఉంది. ఇది అమెరికాలోనే ఐదవ అతిపెద్ద ప్రైవేట్ ఆసుపత్రి వ్యవస్థ.
ఇండియన్ రెడ్‍క్రాస్ సొసైటీతో సహా వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా నాటా 250 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఆంధప్రదేశ్ మరియు తెలంగాణలోని వివిధ గ్రామాలు మరియు పట్టణాలకు విరాళంగా ఇచ్చింది. మే 31, 2021 న 85 కాన్సంట్రేటర్లు మరియు 1400 పల్స్ ఆక్సిమీటర్లను రెడ్‍క్రాస్ ద్వారా వివిధ జిల్లాలకు పంపిణీ చేశారు మరియు ఈ ప్రయత్నాన్ని సమన్వయం చేసినందుకు డాక్టర్ అరుమల్ల శ్రీధర్ రెడ్డికి మరియు ఎపి స్టేట్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ కృష్ణ బాబుకు నాటా ప్రత్యేక క•తజ్ఞతలు తెలియ చేస్తోంది. ఇవి కాకుండా నాటా 165 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెయ్యి పల్స్ ఆక్సిమీటర్లు, మరియు వేలాది వైద్య వస్తు సామగ్రిని అవసరమైన కోవిడ్ రోగులకు నాటా పంపిణీ చేసింది.
ఈ రకమైన పరిస్థితి ఇంతకు ముందెన్నడూ చూడలేదు. నాటా వివిధ అనాథాశ్రమాలకు, మృతదేహాలను దహనం చేయడానికి సహాయం చేస్తున్న సంస్థలకు, కోవిడ్ ప్రభావంతో ఉన్న కుటుంబాలకు ఆహారం పంపిణీకి కూడా సహాయం చేస్తోంది. అనేక మంది కోవిడ్ రోగులు నిరుద్యోగాన్ని ఎదుర్కుంటూ మరియు దాని పైన వారు లక్ష్లల రూపాయల వైద్య బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. దీనితో పరిస్థితి మరింత దిగజారింది. ప్రతి ఒక్కరూ తమకు వీలైనన్ని కుటుంబాలకు సహాయం చేయడానికి ప్రయత్నించాలని నాటా ప్రెసిడెంట్ డాక్టర్ గోసల రాఘవ రెడ్డి కోరారు.