నాటా ఐడల్ 2018 విజేత విష్ణు ప్రియా కొత్తమాసు కు ఘన సన్మానం
కళాభారతి న్యూజెర్సీ ఆధ్వర్యములో, నాటా ఐడల్ 2018 అవార్డు గెలుపొందిన చిన్నారి విష్ణు ప్రియా కొత్తమాసు ను ఘనంగా సన్మానించారు. ఎడిసన్, న్యూజెర్సీ లో జరిగిన ఈ కార్యక్రమానికి కళాభారతి సంఘ సభ్యులు, స్నేహితులు మరియు వివిధ తెలుగు సంఘాల పెద్దలు అధిక సంఖ్యలో హాజరు అయినారు.
నాటా ఆద్యక్షుడు శ్రీ రాజేశ్వర్ రెడ్డి గంగసాని గారి ఆధ్వర్యంలో నాటా మెగా కన్వెన్షన్ ఫిలడెల్ఫియా లో విజయవంతముగా జరిగినది, ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు ప్రియా కొత్తమాసు నాటా ఐడల్ 2018 అవార్డు గెలుపొందింది. నాటా వారు ఎంతో ప్రతిష్టాత్కంగా అమెరికా దేశ వ్యాప్తముగా నిర్వహించిన ఈ పోటీలకు ప్రముఖ గేయ రచయిత శ్రీ చంద్రబోస్ మరియు సంగీత దర్శకులు శ్రీ కళ్యాణ్ మాలిక్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. గెలుపొందిన విష్ణు ప్రియా కొత్తమాసు కు తన తదుపరి చిత్రములో గాయనిగ అవకాశం ఇవ్వనున్నారు శ్రీ కళ్యాణ్ మాలిక్.
ఈ సన్మాన కార్యక్రమంలో వివిధ సంఘాల సభ్యులు మరియు తెలుగు జాతీయ సంఘాలు ఐన నాటా (ఉత్తర అమెరికా తెలుగు సమితి), ఆటా (అమెరికా తెలుగు సంఘము), తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘము) నుండి విచ్చేసి చిన్నారిని అభినందించి దీవించటం జరిగింది.
కళాభారతి చిన్నారుల ప్రతిభను గుర్తిస్తూ జరిపిన ఈ కార్యక్రమము ఎంతో బాగుంది అని, మన సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అంది0చటంలో కళాభారతి ఎప్పుడు ముందు ఉంటుంది అని వారు అన్నారు.
కళాభారతి ప్రతి సవంసత్సరం వినాయక చవితి, హోలీ, దీపావళి వంటి పండుగల సందర్భముగా నిర్వహించే సాంస్కృతిక కారక్రమాలలో చిన్న తనమునుండి పాల్గొంటున్న విష్ణు ప్రియా ఈనాడు ఈ విజయాన్ని సాధించటం ఎంతో అభినందనీయం. విష్ణు ప్రియా మరిన్ని విజయాలను అందుకోవాలని విచ్చేసిన పెద్దలు మరియి కళాభారతి సభ్యులు కోరారు.
పలుమంది చిన్నారులు ఈ సందర్భముగా తమ పాటలతో, నృత్యాలతో విచ్చేసిన అతిధులను అలరించారు.













