ఆ తప్పు నాదే… క్షమించండి
డేటా దుర్వినియోగం కాకుండా నియంత్రించేందుకు ఫేస్బుక్ కానీ, సంస్థ సభ్యులు కాని తగినంత కసరత్తు చేయలేదని ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అమెరికా కాంగ్రెస్‌కు వెల్లడించారు. ఇందుకు శాసనకర్తలను క్షమాపణలు కోరారు. తమ బాధ్యతకు సంబంధించి తగినంత విస్తృత దృక్పథాన్ని ఏర్పర్చుకోలేకపోయామని, అది పెద్ద తప్పేనని లిఖితపూర్వకంగా అందజేసిన వాంగ్యూలంలో అంగీకరించారు. అది నా తప్పే. అందుకు నా క్షమాపణలు. ఫేస్‌బుక్‌ను నేనే ప్రారంభించాను. నేనే నడుపుతున్నాను. ఇక్కడ జరుగుతున్నదానికి నాదే బాధ్యత. అని అన్నారు. అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యాన్ని గుర్తించి ప్రతిస్పందించడంలో ఫేస్బుక్ చాలా నిదానంగా ఉందని అంగీకరించారు. లోపాలను అధిగమించి పనితీరు మెరుగుపర్చుకుంటామని హామీ ఇచ్చారు.













