అప్పుడే కథ ముగియలేదు : అమెరికా మంత్రి
ప్రపంచ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అణు బకర్ అల్ బగ్దాదీనికి అంతమొందించడాన్ని ఒక గొప్ప విజయమని అమెరికా రక్షణశాఖ మంత్రి మార్క్ ఎస్పర్ అన్నారు. అమెరికా చరిత్రలో ఇది ఒక గొప్ప రోజు అన్నారు. ఈ ఆపరేషన్ నిర్వహించిన అమెరికా సైన్యాన్ని మార్క్ ఎస్పర్ ప్రశంసించారు. కొన్ని దేశాల సహకారంతో ఐసిసి సామ్రాజ్యాన్ని కూలదోశామని ఇప్పుడు సంస్థ అధినేతనే మట్టుపెట్టామని తెలిపారు. అయితే దీంతోనే ఐసిసి కథ ముగియలేదని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాని మూలాలను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరముందన్నారు. ప్రపంచాన్నే బెదిరించడానికి ప్రయత్నించిన ఉగ్రవాది తన అఖరి క్షణాల్ని భయంగా భయంగా గడిపాడన్నారు. అమెరికన్ సైనికులు అతన్ని చుట్టుముట్టగానే భయంతో వణికిపోయాడని చెప్పారు.













