మనం ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో లేము!
అమెరికాలో చెలరేగిన అల్లర్లను అణిచివేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దించుతానంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడాన్ని రక్షణ మంత్రి మార్క్ ఎస్పెర్ బాహాటంగా వ్యతిరేకించారు. అంతర్గత వ్యవహారాల్లోకి చట్టపరంగా సైన్యాన్ని దించేంత పరిస్థితి దేశంలో లేదని ఆయన సృష్టం చేశారు. శాంతి భద్రతల వ్యవహారాల్లో సైన్యాన్ని ఉపయోగించడం అనేది చిట్టచివరి పరిష్కారం. అత్యవసర పరిస్థితులు, భయంకరమైన వాతావరణం నెలకొన్నపుడు మాత్రమే సైన్యానికి అవకాశం ఇవ్వాలి. మనం ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో లేము. కాబట్టి తిరుగుబాటు చట్టాన్ని ప్రయోగించేందుకు నేను వ్యతిరేకం అని తెలిపారు.













