లాస్ ఏంజెల్స్ లో కొత్త “స్టే-ఎట్-హోమ్” ఆర్డర్
లాస్ ఏంజెల్స్ లో గడిచిన రెండు వారాల్లో 40,893 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు కాగా శనివారం నాటికీ 155917 కరోనా వైరస్ కేసులు మరియు 4096 మరణాలు లాస్ ఏంజెల్స్ లో నమోదు అయ్యాయి అని అధికారులు వెల్లడించారు. లాస్ ఏంజిల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టి ఆదివారం 19 జూలై CNN తో మాట్లాడుతూ “ లాస్ ఏంజిల్స్ లో కరోనావైరస్ బాగా వ్యాప్తి చెందటంతో, లాస్ ఏంజిల్స్ లో కొత్త “స్టే-ఎట్-హోమ్” ఆర్డర్ జారీ చేసే సూచనలు ఉన్నాయి. స్టే-ఎట్-హోమ్ అంటే అని మూసివేయడం కాకుండా ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించనుంది” అని అన్నారు. క్రొత్త ఆర్డర్ యొక్క సమయం లేదా పరిధి గురించి మరింత నిర్దిష్టంగా చెప్పడానికి లాస్ ఏంజిల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టి నిరాకరిస్తూ “మేయర్లకు ఏమి తెరవాలి మరియు ఏది మూసివేయాలి అనే దానిపై నియంత్రణ తీసుకునే అధికారం ఉండదు. ఇది రాష్ట్ర మరియు దేశ స్థాయిలో ఉంటుంది.
కరోనా వైరస్ వ్యాప్తి ఏది తెరిచిన మరియు మూసివేయబడిన వాటి గురించి మాత్రమే కాదు, మనం వ్యక్తిగతంగా చేసే పనుల గురించి కూడా ఉంటుంది. మనం వ్యక్తిగతంగా చేసే పనుల పైన దృష్టి పెట్టడం మంచిది. కరోనా వైరస్ కేసులు పెరిగిన మేము మరింత పరీక్షలు నిర్వహిస్తున్నాం మరియు లక్షణాలు లేని వ్యక్తులకు పరీక్షలు అందించిన మొదటి నగరం మేము” అని తెలిపినట్టు తెలిసింది.













