3డీ ప్రింట్ అభివృద్ధి చేసిన భారత సంతతి శాస్త్రవేత్త!
రక్తనాళాలతో కూడిన 3డీ ప్రింట్ సజీవ చర్మ నిర్మాణాన్ని భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త నేతృత్వంలోని ఓ బృందం అభివృద్ధి చెసింది. సహజ చర్మానికి ప్రత్యామ్నాయంగా ఉంటూ వివిధ పరిశోధనలకు సాయపడే ఈ అవిష్కరణ చర్మ నిర్మాణంలో కీలక ముందడుగని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. కణాలు, వాటి అభివృద్ధి, జీవ సంబంధిత అంశాలను ఉపయోగించి ఈ 3డీ ప్రింట్ సజీవ చర్మాన్ని అభివృద్ధి చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. సహజ కణజాలం లక్షణాలను ఈ 3డీ ప్రింట్ నమూనా పోలి ఉంటుందని అమెరికాలోని రెన్స్సెలియర్ పాలీటెక్నిక్ ఇనిస్టిట్యూట్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న భారత సంతతి చెందిన పంకజ్ కరండే వివరించారు. ఈ ఆవిష్కరణలో శరీర రక్త ప్రసరణ ధర్మాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకపోవడంతో ఈ 3డీ ప్రింట్ చర్మం.. గాయల్ని నయం చేసేందుకు కొంత సమయం వరకు మాత్రమే పోరాడుతుందని ఆయన తెలిపారు.













