ఆటా మాట్రిమోనియల్ సర్వీస్ ప్రారంభం
అమెరికా తెలుగు సంఘం (ఆటా) తన సభ్యుల కోసం మెట్రిమోనీ సర్వీస్‌ను ప్రారంభించింది. అమెరికాలోనూ, ఇండియాలోనూ ఉన్న తెలుగు కమ్యూనిటీకి ఉపయోగపడే విధంగా ఈ సర్వీస్‌ను ప్రారంభించినట్లు ఆటా ఓ ప్రకటనలో తెలిపింది. మే 4వ తేదీన రాలేలో జరిగిన ఆటా బోర్డ్ మీటింగ్‌లో ఈ సర్వీస్‌ను www.atamatrimony.com ను ప్రారంభించారు. ఆటా సభ్యులకు ఈ సర్వీస్ ఉచితమేనని, సభ్యులుకానివారు ఇందులో సభ్యులుగా చేరాలని అప్పుడే వారికి సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.
ఇతర వివరాలకు సంప్రదించండి.
Website: www.atamatrimony.com
Email: ATA-Matrimony@ataworld.org













